విద్యుత్ పొదుపు చేసే కొన్ని ప్రయత్నాలు డబ్బును కూడా ఆదా చేస్తాయి.

విద్యుత్ ఆదా చేయడానికి కొందరు ఆఫ్ చేస్తుంటారు. మరి, అలా చేయొచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

ఫ్రిజ్‌ నిరంతరం పనిచేస్తే విద్యుత్ ఎక్కువ ఖర్చవుతుంది. కానీ, ఫ్రిజ్ ఎప్పుడూ ఆన్‌లో ఉండాల్సిందే.

ఫ్రిజ్‌ను ఆఫ్ చేస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువట.

ఫ్రిజ్ ఆఫ్ చేసినపుడు అందులోని పదార్థాలు చెడిపోతాయట.

ఆఫ్ చేసిన తర్వాత క్రమంగా ఫ్రిజ్ లోపల వేడెక్కడం ప్రారంభం అవుతుంది.

తిరిగి ఆన్ చేసినపుడు చల్లబరిచేందుకు కంప్రెసర్ మరింత ఎక్కువ సమయం పాటు శ్రమించాల్సి ఉంటుంది.

అందువల్ల విద్యుత్ మరింత ఎక్కువ వినియోగం అవుతుంది. కనుక లాభం కంటే నష్టమే ఎక్కువ.

ఇప్పుడు ఫ్రిజ్‌లు ఆటో థర్మోస్టార్ట్, ఆటో కట్ ఆఫ్ ఆప్షన్లలో వస్తున్నాయి. నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరుకున్నాక కంప్రెసర్ ఆగిపోతుంది.

Representational Image: Pexels