గుడ్లు పోషకాహారం. చాలా విటమిన్లు, మినరల్స్, ఖనిజలవణాలతో ఉండే పౌష్టికాహారం.

అతిగా తింటే మాత్రం తప్పకుండా దుష్ప్రభావాలుంటాయట. అనారోగ్యాలకు కారణం అవుతాయట.

గుడ్లు పరిమితికి మించి తింటే గుండె ఆరోగ్యానికి హాని జరగవచ్చు. ఇవి కొలెస్ట్రాల్ పెంచుతాయి.

గుడ్లు ఎక్కువగా తీసుకుంటే అజీర్తికి దారి తియ్యవచ్చు. ప్రొటీన్ ఎక్కువ కనుక జీర్ణం కావడానికి సమయం పడుతుంది.

అందుకే గుడ్లను ఒకే సారిగా కాకుండా విడతలుగా తినాలి .

గుడ్లు ఎక్కువ గా తింటే అందులో ఉండే ప్రొటీన్ వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది.

ప్రొటీన్ అరిగించుకునేందుకు శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. వాంతులు, వికారం, గ్యాస్ రావచ్చు.

గుడ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో కొవ్వు ఉండడమే ఇందుకు కారణం.

గుడ్లు పరిమితికి మించి తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది. డయాబెటిస్ సమస్య రావచ్చు.

Representational image:Pexels