చికెన్ పాక్స్ రాకుండా ఉండాలంటే! చికెన్ పాక్స్ సాధారణంగా ఎండాకాలంలో వస్తుంది.. కానీ ఇప్పటికీ వైరస్ చాలామందికి వ్యాపిస్తూనే ఉంది చికెన్ పాక్స్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు పూర్తిగా పరిశుభ్రత పాటించాలి.. తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు నోటికి చేయి అడ్డం పెట్టుకోవాలి,చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఐసోలేషన్ పాటించాలి..మీ చుట్టుపక్కవారి ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు ఐసోలేషన్ పాటిస్తే వైరస్ వ్యాప్తి చెందదు ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది..అందుకే వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మీరు వినియోగించే టవల్స్, సోప్స్ , కశ్చీఫ్ ఎవ్వరితోనూ షేర్ చేసుకోరాదు నిత్యం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చేయాలి వైరస్ వ్యాపించిన లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి సూచించిన మందులు వినియోగించాలి ఇంట్లో ఒకరికి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మిగిలినవారికి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి Images Credit: Freepik