పురుషుల కంటే స్త్రీలకే తలనొప్పి ఎక్కువగా వస్తుందట. 50 సంవత్పరాల లోపు మహిళల్లో తరచుగా తలనొప్పి అనారోగ్య సూచనట. తలనొప్పి మహిళల్లోనే ఎక్కువగా ఉండేందుకు కారణం ఏమిటో తెలుసుకుందాం. నెలసరులు, గర్భధారణ, మెనోపాజ్ కారణంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు చాలా ఎక్కువ. ఈస్ట్రోజన్ లో జరిగే హెచ్చుతగ్గులవల్ల తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ తో బాధపడే స్త్రీలలో తలనొప్పి హార్మోన్ల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది మహిళలు నెలసరి ముందు లేదా తర్వాత మైగ్రేన్ తో బాధపడతారట. పురుషుల కంటే మహిళల మీద ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి ఆందోళనకు గురైనపుడు పురుషుల కంటే స్త్రీలు త్వరగా అనారోగ్యం బారిన పడతారట. నిద్రలేమి, ఒత్తిడి స్త్రీలలో తలనొప్పికి ముఖ్యమైన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ. Images courtesy : Pexels