చలికాలంలో చాలా మందికి మలబద్దక సమస్య ఎక్కువవుతుంది. దీన్ని నివారించేందుకు తప్పకుండా కొన్ని పదార్థాలు తీసుకోకూడదు.

క్రీమ్ సూప్స్, ప్రాసెస్ చేసిన బ్రెడ్స్, హాట్ చాక్లెట్ శుద్ధి చేసిన ధాన్యాలలలో శీతాకాలానికి అవసరమైన ఫైబర్లు ఉండవు

తగినంత ఫైబర్ లేకపోతే జీర్ణవ్యవస్థలోని మైక్రోబయోమ్ ను మార్చేసి జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. మలబద్దకానికి కారణం అవుతుంది.

చల్లని వాతావరణంలో టీ, కాఫీ, హాట్ చాక్లెట్స్ వంటివి వేడిగా తీసుకోవడం బావుంటుంది. కానీ ఇవి డీహైడ్రేట్ చేస్తాయి.

కెఫిన్ కలిగిన ఈ పానీయాల వల్ల మలబద్దకం సమస్య పెరుగుతుంది. వీటిని వీలైనంత తక్కువ తీసుకోవడమే మంచిది.

మైదాతో చేసిన బ్రెడ్స్, కేకులు, మఫిన్స్ వంటి బేకరి పదార్థాలు, స్వీట్స్ తీసుకోవడం హానికరం.

బేకరీ పదార్థాలలో, స్వీట్లలో ట్రాన్స్ ఫ్యాట్ లు ఎక్కువ. ఇవి గట్ బ్యాక్టీరియాను అసమతుల్యం చేస్తాయి. ఫలితంగా మలబద్దకం పెరుగుతుంది.

రెడ్ మీట్స్ లో హెవీ ప్రొటీన్ తో ఉంటాయి. చాలా వరకు వేపుళ్లు కూడా తగినంత ఫైబర్ కలిగి ఉండవు.

ఇవి జీర్ణం కావడంలో సమయం ఎక్కువ పడుతుంది. అందువల్ల పేగుల్లో కదలికలు నెమ్మదిస్తాయి. ఫలితంగా మలబద్దకం ఏర్పడుతుంది.

Images courtesy : Pexels