వయసు 30 దాటేసరికి ఆరోగ్యం విషయంలో కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా అవసరం. జంక్ ఫూడ్ పూర్తిగా వదిలెయ్యాలి. విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్, ఫైబర్, జింక్, పొటాషియం కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి. చక్కెర ఎక్కువ వాడితే అది ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. కనుక చక్కెర వీలైనంత తగ్గించి తీసుకోవాలి. చక్కెర ఎక్కువ తినేవారిలో దీర్ఘకాలంలో చర్మానికి అత్యధిక అవసరమైన స్కిన్ ప్రొటీన్ కొల్లాజెన్ నష్టపోతుంది. తప్పనిసరిగా క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ఇది మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది. బరువు అదుపులో ఉంటుంది. మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు కూడా క్రమం తప్పని వ్యాయామం అవసరం. విశ్రాంతి కూడా ముఖ్యం. రోజుకి కనీసం ఏడు గంటల మంచి నిద్ర అవసరం. ఇది శరీరం తిరిగి శక్తి పుంజుకోవడానికి అవసరం. వయసు పెరిగే కొద్దీ సెల్ఫ్ లవ్ అనేది జీవితంలో ముఖ్యమైన విషయం అని గుర్తుంచుకోవాలి. Images courtesy : Pexels