బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్నే ప్రయత్నాలు మొదలు పెట్టాలంటున్నారు. నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని బరువును చెక్ చేసుకోవాలి. ఇది మీరు పాటించిన పద్ధతులకు ఫలితముందో లేదో చెప్తుంది. టిఫిన్ తినడానికి ముందే వ్యాయామం చేయడం ఉత్తమం. బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే చాలా మంచిది. దీనివల్ల ఆకలి తగ్గి.. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తినకుండా చేస్తుంది. తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉదయాన్నే పొందే విటమిన్-డి బరువు నిర్వహణలో సహాయం చేస్తుంది. (Image Sources : Unsplash)