గర్భిణులు ఆహారం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం అవసరం. కొన్ని పదార్థాలు అసలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం తీసుకుంటున్నపుడు సరిగ్గా ఉడికినవి మాత్రమే తినాలి. లేదంటే ఫూడ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పాశ్చరైజ్ చెయ్యని పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిది. లేకపోతే లిస్టేరియా మోనోసైటోజెన్స్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గర్భస్రావం వంటి తీవ్రమైన పరిణామాలు ఉండొచ్చు. చేపలు కచ్చితంగా పోషకాహారమే. కానీ కొన్ని రకాల చేపలను గర్భిణులు తినకపోవడమే మంచిది. సొరచేపలు, కింగ్ మాకెరెల్, టేల్ ఫిష్ వంటి వాటిలో మెర్య్కూరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువు ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. Images courtesy : Pexels