మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలున్నాయి.

ఆందోళన చాలా మందికి ఉండే మానసిక సమస్య దీన్ని తగ్గించే ఆయుర్వేద మార్గాలు తెలుసుకుందాం.

అడాప్టోజెనిక్ లక్షణాలు కలిగిన అశ్వగంధ శరీరం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోనేందుకు సహాయపడుతుంది.

మానసిక ప్రశాంతతకు, జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు బ్రహ్మీ మంచి మందు.

చమోమిలే టీ ఒక మంచి ఆయుర్వేద మందు. నిద్రకు ముందు ఒక కప్పు వెచ్చగా తీసుకుంటే మంచి భావన కలిగిస్తుంది.

గోరువెచ్చని నువ్వుల నూనెతో మసాజ్ చెయ్యడం వల్ల కండరాలు, నాడీ వ్యవస్థ నెమ్మదించి ప్రశాంతంగా అనిపిస్తుంది.

జటమాన్సి మనసును శాంత పరిచి ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తుంది.

కుంకుమ పువ్వులో మూడ్ బాగు చేసే లక్షణాలు ఉంటాయి. పాలలో చిటికెడు కుంకుమ పువ్వు కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

క్రమం తప్పకుండా ప్రాణాయామ, యోగా చేస్తే ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
Images courtesy : Pexels and Unsplash