‘యానిమల్’ మూవీతో త్రిప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక్కడ ఆమె ఫిట్నెస్ రహస్యాలు తెలుసుకుందాం. త్రిప్తి దిమ్రి రెండు గ్లాసుల వెచ్చని నీటితో తన రోజును ప్రారంభిస్తుందట. ఇది ఆమెను హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. యోగా, మెడిటేషన్ వంటి రకరకాల ఫిట్నెస్ ఎక్సర్సైజులు ఆమె రోటీన్ లో భాగం. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఫిట్నెస్ లో భాగంగా ఆమె డాన్స్ క్లాసులు కూడా తీసుకుంటుందట. ఇది ఆమె వర్కవుట్ ను ఎంజాయ్ చేసేందుకు దోహదం చేస్తుంది. డాన్స్ కార్డియో వాస్క్యూలార్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. బ్రేక్ ఫాస్ట్ లో గింజలు, ఓట్స్, ఎండుద్రాక్ష, బాదం పాలతో కలిపి తీసుకుంటుంది. ఫలితంగా రోజంతా ఎనర్జీ లభిస్తుంది. లంచ్ లో అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు పాపడ్, సలాడ్, ఊరగాయల వంటి అన్ని పదార్థాలు చేర్చుకుంటుంది. డిన్నర్ తేలికగా ఉంటేలా చూసుకుంటుందట. ఉడికించిన గుడ్లు, కూరగాయలు, పప్పు, సూపుల వంటివి తీసుకుంటుంది. ఇది రాత్రి జీర్ణక్రియ తేలికగా ఉండేట్టు, ప్రశాంతమైన నిద్రకు దోహదం చేస్తుంది. Images courtesy : Instagram