చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి పోషణ అందించే ఆహారాలు తీసుకోవాలి. బాదములు విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్ తో పవర్ హౌజ్ వంటివి. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన ఆక్రూట్ తినడం వల్ల గుండె ఆరోగ్యం బావుటుంది. శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతుంది. జీడిపప్పుల్లో ఇమ్యూనిటి పెంచే జింక్ తోపాటు తిన్న సత్వరం శక్తిని అందిస్తాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగానూ ఉంచుతాయి. పీకాన్ నట్స్ జీవక్రియలు వేగవంతం చేసేందుకు తోడ్పడుతాయి. చలికాలంలో చురుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి. బ్రెజిల్ పిస్తాల్లో సిలినియం ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. చలికాలంలో ఇలా కొన్ని గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శక్తిమంతంగా ఉండవచ్చు. Images courtesy : Pexels