కొన్ని ఆహారాలను పచ్చిగా తింటేనే ఆరోగ్యం. అవేంటో చూద్దామా.

కొన్ని కూరగాయలను వండినపుడు వాటిలో పోషకాల నష్టం జరుగుతుంది. అలాంటివి పచ్చిగా తినడమే మంచిది.

ఉల్లిని వండినపుడు వాటిలోని క్యాన్సర్ నుంచి రక్షణనిచ్చే ఫైటోకెమికల్స్ నష్టపోతాయి.

కీరదోస తాజాగా, కరకరలాడుతూ నీటితో ఉంటుంది. వీటిని ఉడికిస్తే కరకరలాడే స్వభావంతో పాటు పోషకాలు నష్టపోతాయి.

అవకాడోలో ఉండే మినరల్స్, ఫైబర్ వండినపుడు నష్టపోతాయి. కనుక పచ్చిగా తినగలిగితే చాలా మంచిది.

బెర్రీలు పోషకాల భండాగారాలు. చాలా రుచికరమైనవి కూడా వీటి ఫ్రీజ్ చేసి లేదా ఎండబెట్టి కూడా తినవచ్చు .

ఆలివ్ ఆయల్ లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. సలాడ్ టాపింగ్ గా వాడాలి.

గింజలను కాల్చి తింటుంటారు కానీ పచ్చిగా తిన్నపుడు విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ అందుతుంది.

బ్రకోలీలో సల్ఫోరాఫేన్ అనే యాంటీకార్సినోజెన్ ఉంటుంది. ఇది పచ్చిగా తిన్నపుడు 10 రెట్లు ఎక్కువగా శరీరానికి అందుతుంది.

వెల్లుల్లి సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వండినపుడు ఇవి నష్టపోవచ్చు.

రెడ్ క్యాప్సికం పచ్చిగా తీసుకోవాలి. వీటిని వండినపుడు విటమిన్ సి, బి కాంప్లెక్స్ నష్టపోవచ్చు.
Images courtesy : Pexels