ఉల్లి లేకుండా ఏ కూరకు రుచి రాదు. దాదాపు అన్ని భారతీయ వంటల్లోనూ ఉల్లి ఉపయోగిస్తారు.

ఆలు అందరికీ ఇష్టమైన దుంప కూరగాయ. వేయించుకుని, కూర చేసుకుని, రకరకాల స్ఠఫ్ లలోనూ వాడుతారు.

ఆలు, ఉల్లీ వంటిళ్ళలో సాధారణంగా ఉండే కూరగాయలు. రెండింటినీ ఒకే చోట నిల్వ చేస్తే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు



రెండింటిని ఒకే చోట నిలువ చేసినపుడు కొన్ని రకాల రసాయన చర్యలు జరిగే ప్రమాదం ఉందట.

ఉల్లిపాయల నుంచి ఇథలిన్ గ్యాస్ విడుదలవుతుంది. ఇది ఆలులో చర్యకు కారణం అవుతుందట.



ఉల్లి నుంచి వెలువడే ఇథలిన్ వల్ల ఆలులో మొలకలు వస్తాయి. ఆలు మెత్తబడి పాడైపోతాయి.

ఆలుగడ్డలతో కలిసి ఉన్నపుడు ఉల్లిపాయలు కూడా త్వరగా పాడైపోతాయి.

ఇలా ఒకే చోట నిల్వ చేసిన ఉల్లి, ఆలు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

Image courtesy : Pexels