క్రిస్మస్ అంటే ప్రియమైన వారికి బహుమతులు పంచుకోవడం ఆనవాయితీ. మరి మీ భాగస్వామికి ఏమిస్తున్నారు?

ప్రత్యేకమైన జువెలరీ గిఫ్ట్ చెయ్యవచ్చు. నెక్లెస్ లేదా బ్రేస్లేట్ ఏదైనా కావచ్చు.

ఒక వీకెండ్ మీ భాగస్వామితో కలిసి ఒక హాలీడే ప్లాన్ చెయ్యవచ్చు.

కాస్త సమయం పెట్టి మీ సృజనాత్మకతకు పదును పెట్టి ఏదైనా ఒక ఆర్ట్ పీస్ తయారు చేసి ఇవ్వటం ఒక మంచి భావనను ఇస్తుంది.

ఇద్దరూ కలిసి ఏదైనా కుకరీ క్లాస్ జాయిన్ కావచ్చు. కలిసి వంటచేసుకోవడం ఒక రొమాంటిక్ ఎక్స్పీరియన్స్.

మీ వివాహ వార్షికోత్సవం, తన పుట్టిన రోజు, పిల్లల పుట్టిన రోజుల వంటి డెటాతో ఒక స్టార్ మ్యాప్ తయారు చేసి ఇవ్వవచ్చు.

ఫోటోలు, జ్ఞాపకాలను తాజాగా మర్చే మంచి మార్గాలు. ఒక మంచి ఫోటో ఆల్బం కూర్చి కూడా గిఫ్ట్ గా ఇవ్వవచ్చు.

స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్ వంటి పర్సనలైస్డ్ గాడ్జెట్స్ కూడా బహుకరించవచ్చు.



Images courtesy : Pexels