రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రాగిజావను చాలామంది తమ డైట్లో చేర్చుకుంటారు. ప్రోటీన్ కావాలనుకునేవారు రెగ్యూలర్గా రాగిజావ తాగొచ్చు. సహజంగా బరువు తగ్గడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. చర్మాన్ని వృద్ధాప్య లక్షణాలనుంచి దూరం చేస్తుంది. అంతేకాకుండా జుట్టురాలే సమస్యను కంట్రోల్ చేస్తుంది. మధుమేహాన్ని నివారించడంలో రాగిజావ చేసేమేలు అంతా ఇంత కాదు. చలికాలంలో దీనిని తీసుకోవడం వల్ల మెరుగైన జీర్ణక్రియ అందుతుంది. (Image Source : Unsplash)