ఈ సీజన్ లో దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయిలో ఉండే పోషకాలు చాలా ఎక్కువ. బొప్పాయి చుట్టూ ఎన్నో అపోహలున్నాయి. ఎలా తింటే మంచిదో తెలుసుకుందాము. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఫైబర్ ఎక్కువ కనుక హైపర్ అసిడిటి, మలబద్దకం తగ్గుతుంది. బొప్పాయి పండును ఉదయం పరగడుపున తింటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని టాక్సిన్స్ ను సమర్థవంతంగా బయటకు పంపుతుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల రోజంతా రక్తంలో గ్లూకోస్ స్థాయి స్థిరంగా ఉంటుంది. ఉదయాన్నే బొప్పాయి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు నివారించబడుతాయి. క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు బొప్పాయి తింటే శరీరఛాయ మెరుగవుతుంది. చర్మం మీద వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. మొటిమలు తగ్గుతాయి. బొప్పాయి అలెర్జీ ఉన్నవారు, గర్భిణులు, అరిథమియాసిస్ వంటి గుండె సమస్యలున్నవారు, లోబీపీతో బాధపడే వారు తినకూడదు. Images courtesy : Pexels