ఈ మధ్య పెద్దగా లింగ బేధం లేకుండా అందరూ మందు కొట్టెస్తున్నారు. కానీ ఆల్కహాల్ వల్ల పురుషుల కంటే స్త్రీలకి మరింత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే బరువున్న స్త్రీ పురుషులు ఒకే మొత్తంలో ఆల్కహాల్ తాగినా స్త్రీలో బ్లడ్ ఆల్కహాల్ కాన్సెన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందట. గ్యాస్ట్రిక్ ఆల్కహాల్ డీ హైడ్రోజెనేస్ కాన్సన్ట్రేషన్స్ పురుషుల్లో ఎక్కువగా ఉండటమే అందుకు కారణమట. ఆల్కహాల్ స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. బీపీ కూడా పురుషులతో పోల్చినపుడు త్వరగా పెరుగుతుంది. ఇది గుండె సమస్యలకు కారణం కావచ్చు. నిర్ణీత సమయంలో ఒకే మొత్తంలో స్త్రీ పురుషులు ఆల్కాహాల్ తీసుకుంటే పురుషుడి కంటే స్త్రీ లివర్ మీద ఎక్కువ దుష్ప్రభావం ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల మానసిక స్థితి మీద ఆల్కహాల్ చాలా త్వరగా ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ వినియోగం వల్ల మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఆల్కహాల్ అలవాటు ఉన్న స్త్రీలలో చికిత్సకు లొంగని సంతాన సాఫల్య సమస్యలు వస్తాయి. పురుషుల కంటే త్వరగా లివర్ సిర్రోసిస్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతంది. Images courtesy : Pexels