శరీరంలో నుంచి టాక్సిన్లను తొలగించేందుకు, ఇమ్యూనిటి పెంచడంలో ‘పసుపు’కు తిరుగు లేదు.

పసుపు నీళ్లు రోజూ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

పసుపులో పుష్కలంగా ఉండే సమ్మేళనం కర్క్యూమిన్. దీనికి యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.



పసుపులో శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే సమ్మేళనాలు ఉంటాయి. అవి జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

చలికాలంలో కీళ్లనొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. దీని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ల నొప్పులు కాస్త తగ్గుతాయి.

అతిగా తిన్నపుడు.. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే పసుపు నీళ్లు తాగడం మంచిది.

చలికాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలకు కూడా పసుపు నీళ్లు చాలా మంచి పరిష్కారం. పసుపు చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

Images courtesy : Pexels