విటమిన్ అత్యవసరమైన సూక్ష్మపోషకం. ఇది శరీరంలో జరిగే జీవక్రియలన్నీ పద్ధతిగా జరిగేందకు అవసరమయ్యే పోషకాల్లో ఒకటి. విటమిన్ డి.. సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. కానీ, చలికాలంలో అది సాధ్యం కాదు. అందుకు బదులుగా ఈ ఆహారాలు తీసుకోండి. విటమిన్ డి ఎక్కువగా ఆవు పాలు, టోఫూ, బాదం మిల్క్ వంటి ప్లాంట్ బేస్డ్ పాల నుంచి కూడా లభిస్తుంది. చేపల్లో లభించే కాడ్ లివర్ ఆయిల్ ద్వారా పుష్కలంగా విటమిన్ డి లభిస్తుంది. చీజ్, ఆవుపాలు, పెరుగు, పనీర్ అన్నీ రకాల డెయిరీ ప్రాడక్ట్స్ ద్వారా విటమిన్ డి తగినంత అందుతుంది. వెంటనే విటమిన్ డి అందే చవకైన మార్గం సూర్యరశ్మి. నేరుగా చర్మాన్ని తాకే సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అందుతుంది. గుడ్డులో కూడా విటమిన్ డి తగినంత ఉంటుంది. విటమిన్ డి తక్కువగా ఉన్నవారికి డాక్టర్లు విటమిన్ డి సప్లిమెంట్లు సూచిస్తారు. images courtesy : Pexels