పచ్చి ఉల్లిపాయలు డయాబెటిస్‌కు కంట్రోల్ చేస్తాయా? ఉల్లిపాయలు లేని కూర ఉండదు. అది లేనిదే కూరకు రుచి ఉండదనే సంగతి తెలిసిందే. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్-C, B6, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఉల్లిలో శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఉల్లి శరీరంలోని కొవ్వును, బ్లడ్ ప్రెజర్‌ను కంట్రల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి ఉల్లి పాయలు కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉల్లిలో ఉండే విటమిన్-సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగాల నుంచి రక్షిస్తుంది. పచ్చి ఉల్లిలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వివిధ క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది. పచ్చి ఉల్లిపాయలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి, డయాబెటిస్ బాధితులకు ఉల్లిపాయలు చాలామంచివి. పచ్చిగా తినొచ్చు. Images Credit: Pixabay and Pexels