ఆరోగ్యవంతమైన శరీర బరువు కలిగి ఉండేందుకు సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బరువు తగ్గాలనుకుంటే విటమిన్ బి కలిగిన ఈ ఆహారపదార్థాలు చాలా ఉపయోగకరమైనవి. విటమిన్లు బి, బి12 కలిగి ఉండే గుడ్డులో మంచి ప్రొటీన్ కూడా ఉంటుంది కనుక త్వరగా ఆకలి తీరుస్తుంది. అవకాడలో నీటి శాతం, పైబర్ ఎక్కువ. ఇవి తీసుకున్నపుడు వైటల్ ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్‌లు శరీరానికి అందుతాయి. మోనోసాచూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు అవకాడోలో చాలా ఎక్కువ. ఆకలి తగ్గి ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. సాల్మన్ లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలం. ఇవి బరువు నియంత్రిస్తాయి. సాల్మన్ లో బి విటమిన్ కూడా తగినంత ఉంటుంది. షియా సీడ్స్ లో విటమిన్ బి12, బి2, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఇతర పొషకాలు ఉంటాయి. బరువు తొందరగా తగ్గేందుకు సహకరిస్తాయి. ప్రొటీన్ ఎక్కువగా ఉండే గింజలతో కూడా బరువు త్వరగా తగ్గవచ్చు. వీటిలో ప్రొటీన్, మినరల్స్, విటమిన్లు పుష్కలం. బాదం, పల్లీలు, వాల్నట్స్ తో జీవక్రియలు మెరుగవుతాయి. ఫలితంగా బరువు తగ్గొచ్చు. Images courtesy : Pexels