కిడ్నీ బీన్స్ రుచి, ఆకృతి వల్లే వాటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.



కానీ వీటిని సరిగా ఉడికించకపోతే ఉబ్బరం వంటి పొట్ట సంబంధిత సమస్యల్ని కలిగిస్తుంది.



ఇందులో లెక్టిన్, ఫైటోహెమాగ్లూటినిన్ వంటి కొన్ని సమ్మేళనాలు ఉన్నాయి.
పచ్చిగా లేదా తక్కువ ఉడికించిన రూపంలో తీసుకుంటే హాని చేస్తుంది.


కిడ్నీ బీన్స్ నానబెట్టడం వల్ల యాంటీ న్యూట్రీషియన్స్ ప్రభావం తగ్గుతుంది.



బీన్స్ నానబెట్టడం వల్ల సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల విచ్చిన్నానికి దోహదపడుతుంది.



కిడ్నీ బీన్స్ నానబెట్టడం వల్ల వాటి ఆకృతి చాలా బాగుంటుంది. మెత్తగా అవుతాయి.



గుండెని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.



శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి గుండెకి మేలు చేస్తుంది.



ధమనుల్లో ఫలకాలు ఏర్పడకుండా చేస్తుంది. అది మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలని స్థిరంగా ఉంచుతుంది.
Images Credit: Pixabay/ Pexels