జపాన్ దీర్ఘాయవు విషయంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.

జపనీయుల సగటు ఆయుర్థాయం 82 సంవత్సరాలు.

జపనీస్ వంటల్లో కూరగాయలు, వేర్లు, దుంపల వినియోగం చాలా ఎక్కువ.

ఇది వారి దీర్ఘాయుష్షుకు మొదటి కారణం.

కరాటే, కెండో, జూడో వంటి యుద్ధ కళలకు పుట్టిల్లు జపాన్. వర్కవుట్‌కు ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

వారి ఆరోగ్యవంతమైన జీవన విధానంలో వ్యాయామం పెద్ద పాత్ర పోషిస్తుంది.

జపనీయుల్లో చాలా మంది ప్రతి రోజూ గ్రీన్ టీ తాగుతారు. భోజనానికి ముందు తర్వాత కూడా తప్పకుండా తీసుకుంటారు.

జపనీయుల ఆహారంలో మరో ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ సీఫుడ్. సాల్మన్, మాకేరెల్, సార్డిన్ వంటి చేపలు అధికం.

ఇలా రకరకాల కారణాలతో జపనీయులు దీర్ఘాయువుతో జీవిస్తున్నారు.
Representational Image: Pexels