చైనాలో గ్రీన్ టీ తాగడం సర్వ సాధారణం. గ్రీన్ టీ అకాల వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. గ్రీన్ టీలో ఫాలీ ఫెనాల్స్అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. గువా షా అనేది సంప్రదాయ చైనీస్ మసాజ్ . ఈ టెక్నిక్ తో స్కిన్ ఎలాస్టిసిటి, రక్తప్రసరణ మెరుగవుతుంది. జిన్సెంగ్, గోజీ బెర్రీ, లికోరైస్ రూట్ వంటి యాంటీ ఎజింగ్ లక్షణాలతో ఉన్న మూలీకలు స్కిన్ కేర్ లో ఉపయోగిస్తారు. టుయ్ నా అనేది అక్యూప్రెషర్ మసాజ్. ఫేస్ టూయ్ నా తో చర్మం మీద ముడుతలు మాయం అవతాయి. చైనీస్ వంటల్లో రకరకాల కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లతో ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడే సమతుల ఆహారం అది. నిద్రకు చైనీయుల సంస్కృతి చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. అదే వారిని యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మంగ్ బీన్ మాస్క్ లు చర్మం నుంచి టాక్సిన్లను తొలగించి క్లియర్ స్కిన్ కు దోహదం చేస్తాయి. ధ్యానం, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా రూపం యవ్వనంగా ఉంటుంది. Representational image:Pexels