కొన్ని తినేందుకు బాగుంటాయి. కానీ, అవి మీ ప్రాణాలను తోడేసే ప్రమాదం ఉంది. వాటిలో కొన్ని ఆహారాలివే. ఎల్డర్ బెర్రీస్ తియ్యగా బాగుంటాయి. కానీ, ఇవి తింటే డయేరియా, వాంతులవుతాయి. ప్రాణాలకూ ముప్పే. కరోలినా రీపర్ అనే మిర్చీని తింటే కడుపు మంట, అల్సర్ రావడం పక్కా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైనది. సార్దీనియా ప్రజలు పురుగులు పట్టిన చీజ్ తింటారు. పురుగుల లార్వా కడుపులోకి చేరడం వల్ల అనారోగ్యానికి గురవ్వుతారు. కర్రపెండలం దుంపను ఉడకబెట్టి తినాలి. లేకపోతే శ్వాసకోస సమస్యలు వస్తాయి. తక్కువ మోతాదులో తినాలి. జంపింగ్ చికెన్ అంటూ గోవాలో కప్పలతో వంటకాలు చేస్తున్నారు. అవి తింటే కిడ్నీ పెయిల్యూర్‌తో చనిపోతారు. జపాన్‌లో ఫుగు అనే చేప చాలా రుచిగా ఉంటుంది. చేపలోని టెట్రోడోటాక్సిన్ ప్రాణాలు తీస్తాయి. అందుకే జాగ్రత్తగా వండుతారు. ఆల్చిప్పలు కూడా ఆరోగ్యానికి మంచివి కాదు. hepatitis Aకి ఇది కారణం అవుతుంది. షాంగైలో ఆల్చిప్పల మాంసాన్ని తిని 3 లక్షల మంది హెపటైటిస్-Aకు గురయ్యారు. 31 మంది చనిపోయారు. Images Credit: Pixabay and Pixels