మీకు లంగ్స్ క్యాన్సర్ ఉందా? అయితే, విటమిన్ C, Eతో కాస్త జాగ్రత్త!

విటమిన్ C, E ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

విటమిన్ C, E లోని యాంటీ ఆక్సిడెంట్లు లంగ్స్ క్యాన్సర్‌ను తీవ్రం చేస్తాయి.

క్యాన్సర్ కణుతులలో రక్తనాళాలు ఏర్పడేలా యాంటీ ఆక్సిడెంట్లు ప్రభావితం చేస్తాయి.

దీంతో క్యాన్సర్ కణితి పరిమాణం పెరిగి వ్యాధి మరింత విస్తరిస్తుంది.

విటమిన్ C సప్లిమెంట్స్ ఎక్కువైతే చాలా సమస్యలు వస్తాయి

గుండెలో మంట, వికారం, తలనొప్పి, కడుపులో మంట, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి.

విటమిన్ E ఎక్కువైనా పలు సమస్యలు తలెత్తుతాయి.

తల తిరగడం, అలసట, బలహీనత, దద్దుర్లు, థ్రోంబోఫ్లబిటిస్ వచ్చే అవకాశం ఉంది.

లంగ్స్ క్యాన్సర్ ఉన్నవాళ్లు అవసరం మేరకే విటమిన్ C, Eని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Photos Credit: pixabay.com