సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటే కలిగే లాభాలివే తెలియకుండానే గంటల సమయం సోషల్ మీడియాలో గడిపేస్తున్నాం. అప్పుడప్పుడు దాని నుంచి బ్రేక్ తీసుకుని బయట ప్రపంచాన్ని చూస్తే మెదడు రిఫ్రెష్ అవుతుంది. ప్రొడక్టివిటీ పెరగడంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కొద్ది రోజులు ఫోన్‌కు దూరంగా ఉంటే మైగ్రేన్, కళ్లు మంటలు, స్ట్రెస్ తగ్గటంతోపాటు మంచి నిద్ర కూడా పొందవచ్చు. ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయచ్చు. ఇంటి పనులలో సహాయం చేయవచ్చు. ఆహారం తినేప్పుడు సోషల్ మీడియా లేకపోతే, మనం తినే ఫుడ్ మీద ఎక్కువ ధ్యాస పెడతాం. సోషల్ మీడియాలో లేకపోతే ఖాళీ సమయం దొరుకుతుంది. ఆ ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సరదాగా బయటకు వెళ్ళడం , ఆడుకోవడం వంటివి చేయచ్చు. ఇవన్నీ చేయాలంటే ముందు మీ సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేయాలి.