రోజూ పుదీనా ఆకులు వినియోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ఔషధ గుణాలు కలిగిన ఆకుకూర.

పుదీనా తీసుకున్నపుడు జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

జీర్ణ వ్యవస్థలోని కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. పైత్యరస ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

పుదీనాలో ఉండే మెంథాల్ శ్వాసమార్గం మీద కూడా ప్రభావం చూపుతుంది.

వాసన చూసినా, మింట్ రూపంలో వాడినా దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం దొరుకుతుంది.

మింట్ వాసన ఒత్తిడి తగ్గిస్తుంది. ఆందోళన తగ్గిస్తుంది. మింట్ అరోమా మూడ్‌ను కూడా బాగు చేస్తుంది.

పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం కనుక శరీరంలో ఫ్రీరాడికల్ చర్యను అదుపు చేస్తుంది.

పుదినాలో యాంటీఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ జబ్బుల నుంచి ఉపశమనం దొరుకుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!



Images courtesy : Pexels