చుండ్రు సాధారణంగా కనిపించే కేశసమస్య. ఆహారంతో ఇది ప్రభావితం అవుతుందని మీకు తెలుసా?

చుండ్రు తగ్గించే ఓ ఐదు రకాల ఆహారాల గురించి తెలుసుకుందాం.

అవకాడో లో ఆవశ్యక పోషకాలెన్నో ఉంటాయి. ఇవి చుండ్రు తగ్గేందుకు దోహదం చేస్తాయి.

దీని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మాడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

బాదాం, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్ నట్స్ లో ఉండే జింక్, ఒమెగా3 చుండ్రు తగ్గించి మాడుకు పోషణ అందిస్తాయి.

పేరుగులో బయోటిన్ ఉంటుంది. ఇది యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో చుండ్రును తగ్గించి జుట్టు ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.



గుమ్మడి గింజల్లో జింక్ ఉంటుంది. మాడు మీద ఉత్పత్తి అయ్యే అధిక నూనెను కంట్రోల్ చేస్తుంది. చుండ్రు తగ్గుతుంది.

చీజ్‌లో ప్రొబయాటిక్స్ ఎక్కువ. ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!



Images courtesy : Pexels