కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి, అందాన్ని పెంచడానికి కంటి రెప్పలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సందర్భాల్లో కనురెప్పలు రాలిపోతుంటాయి. ప్రధానంగా అనారోగ్య సమస్యల వల్లే కనురెప్పలు రాలిపోతాయి. ఇలా కనురెప్పలు రాలిపోతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్‌లో లోపం వల్ల వెంటుకలు బలహీనంగా మారుతాయి. కెమికల్స్ కలిగిన మేకప్ వాడితే కంటి రెప్పలు ఉండిపోతాయి. కళ్ళను ఎక్కువగా నలపడం, కళ్ళ మీద స్ట్రెస్ పడటం, బాక్టీరియా, కంటిరెప్పలు రాలడానికి ప్రధాన కారణాలు. నిద్ర లేకపోవడం, అలసట, జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా కంటి రెప్పలు రాలిపోవచ్చు. వెంటుకులు ఊడటం సాధారణమే. కానీ.. ఎక్కువ ఉడితే వైద్యుడిని సంప్రదించాలి.