బహుమతిగా వచ్చిన పువ్వులను పడేస్తున్నారా? దానికి బదులు ఇలా చెయ్యండి. మీరు ప్రేమించేవాళ్ళ దగ్గర నుంచి రోజ్ అందుకోవడం ఒక గొప్ప అనుభూతి. కాని రోజా పువ్వులు ఒకటి నుంచి రెండు రోజులకు మించి నిలువ ఉండవు. ఈ లిస్ట్ లోని మూడు విధానాలతో మీ మధుర జ్ఞాపకాలను ప్రిజర్వ్ చేసుకోవచ్చు. రోజా పువ్వును పుస్తకంలో దాచిపెట్టండి. బరువైన పుస్తకంలో పువ్వును ఉంచడం ద్వారా మీరు దానిని ఎక్కువ కాలం దాచుకోవచ్చు. పువ్వును గాలిలో ఎండపెట్టండి, అప్పుడు దాని ఆకారం మారకుండా అందంగా కనిపిస్తుంది. అలా ఎండిపోయిన పువ్వులను పూలగుత్తిలా చేసి ఇంట్లో అలంకరించుకోవచ్చు. పూలను మైక్రోవేవ్ ద్వారా త్వరగా ఎండ పెట్టుకోవచ్చు. దానితో పువ్వులను ఈజీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు.