మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి గుడ్డు, పెరుగు: ఒక గుడ్డులో అర కప్పు పెరుగు మిక్స్ చేసి స్కాల్ప్ కి రాయండి. 20 నిమిషాల తరవాత కడగండి. గుడ్డు ద్వారా మీ జుట్టుకు పోషణ అందుతుంది. అరటిపండు: అరటిపండును తేనెతో మిక్స్ చేసి రాస్తే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. పాలు, తేనె: అర కప్పు పాలు, ఒక చంచా తేనె కలిపి మీ జుట్టుకు రాస్కోండి. ఇవి సన్నగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తాయి. కొబ్బరి నూనె, తేనె: రెండు చెంచాల నూనెలో ఒక చెంచా తేనె కలిపి రాస్కోండి. ఇది మీ జుట్టును స్ట్రాంగ్ గా , మెత్తగా ఉంచుతుంది. గుడ్డు, తేనె: ఒక గుడ్డులో రెండు చెంచాల తేనె కలపండి. ఇది జుట్టు రాలడం తగ్గించి , కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.