పోషకాహార లోపం.. కొన్ని తీవ్రమైన రోగాలకు దారితీయొచ్చు. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి గురవ్వుతారు. నీరసం, చిగుళ్లలో వాపు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధికి కారణం అవుతుంది. కాల్షియం లోపం ఏర్పడి ఎముకలు బలహీన పడతాయి. ఐరన్ లోపం వల్ల అనీమియా బారిన పడతారు. బలహీనత, నీరసం, చర్మం పాలిపోవడం, శ్వాసలో ఇబ్బంది ఉంటాయి. థయామిన్ (B1) లోపం వల్ల బేరిబేరి వ్యాధి వస్తుంది. దీని వల్ల నాడీ సంబంధ, కార్డియోవాస్క్యూలార్, గుండె సమస్యలు వస్తాయి. విటమిన్ ఎ లోపం వల్ల రేచీకటి వస్తుంది. వెలుగు తక్కువగా ఉన్నపుడు చూపు తగ్గిపోతుంది. భవిష్యత్తులో తీవ్రమై దృష్టి సమస్యలు రావచ్చు. విటమిన్ డి, కాల్షియం లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ సమస్య రావచ్చు. ఎముక సాంద్రత తగ్గిపోతుంది. Images courtesy : Pexels