కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు, వాపు తగ్గించుకునేందుకు కుంకుమాది తైలం వాడుతారు. కుంకుమాది తైలం క్రమం తప్పకుండా వాడడం వల్ల చర్మ స్వభావం మెరుగుపడుతుంది. కుంకుమాది తైలంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి చర్మం మీద ఫ్రీరాడికల్ చర్యను నిరోధిస్తాయి. ఫలితంగా సన్నటి రేఖలు, తేలికయిన ముడుతల వంటి వయసు ఛాయలు చర్మం మీద కనిపించడం తగ్గుతుంది. కుంకుమాది తైలంలో ఉండే మూలికలు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. కుంకుమాది తైలంతో చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ఇందులోని మూలికలు చర్మ ఛాయను మెరుగు పరుస్తాయి. కుంకుమాది తైలంలో నువ్వుల నూనె, బాదాం నూనె ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels