పాలలో కాల్షియం, విటమిన్ డి తో పాటు చాలా పోషకాలు ఉంటాయి.

అయితే పాలు తాగితే కొందరిలో మొటిమల నుంచి జీర్ణ సంబంధ సమస్యల వరకు రకరకాల సమస్యలు వస్తాయి.

పాలలో ప్రొటిన్, కాల్షియం పుష్కలం. విటమిన్ డి కూడా ఉంటుంది కనుక రోజూ తీసుకుంటే ఎముకలు కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

బరువు తగ్గాలనుకుంటే పాలు తాగడం ఒక ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇందులో తగుపాళ్లలో పోషకాలు ఉంటాయి.

క్రమం తప్పకుండా పాలు తాగే వారిలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ కూడా చేస్తుంది.

పాలలో పొటాషియం ఉంటుంది. కనుక పాలు తాగితే బీపీ అదుపులో ఉంటుంది. గుండెజబ్బులు, స్ట్రోక్ నివారించబడుతాయి.

పాలు తరచుగా తాగే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ కూడా నివారించబడుతుందట. కాల్షియానికి కీమో ప్రొటెక్టివ్ లక్షణాలు కూడా ఉంటాయి.

అయితే పరిమితికి మించి పాలు తాగే వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

లాక్టోజ్ ఇన్టాలరెన్స్ సమస్య ఉన్నవారిలో పాలలో ఉండే సహజ చక్కెర వల్ల అలర్జీ రావచ్చు. ఇది ప్రమాదకరం కాదు కానీ జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels