కృష్ణతోనే అది సాధ్యమైంది, టాలీవుడ్‌కు హాలీవుడ్ రేంజ్!

నటుడు అంటే కేవలం సినిమాల్లో అభినయం వరకే అనుకుంటాం.

కానీ, కృష్ణ అంటే కేవలం నటుడే కాదు.. సినీ ‘టెక్నీషియన్’.

ఔనండి, ఆధునికతను అందిపుచ్చుకోవడంలో కృష్ణ తర్వాతే మరెవరైనా.

టాలీవుడ్‌కు మొదటిసారి 70 MM పరిచయం చేసింది కృష్ణయే.

‘సింహాసనం’ మూవీని ఆయన 70 ఎంఎంలో విడుదల చేశారు.

హాలీవుడ్‌కే పరిమితమైన కౌబాయ్, జేమ్స్ బాండ్ కాన్సెప్ట్‌ను ఇండియాకు తెచ్చింది కూడా కృష్ణయే.

ఇండియాలో తొలి కౌబాయ్ మూవీ ‘మోసగాళ్లకు మోసగాళ్లు’.

ఇండియాలో తొలి జేమ్స్ బాండ్ మూవీ ‘గూడచారి 116’.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలను కృష్ణ ఇండస్ట్రీకి ఇచ్చారు.

టాలీవుడ్ చరిత్రలో కృష్ణ ఈ విధంగా చెరగని ముద్ర వేశారు.

గెట్ వెల్ సూన్ కృష్ణ సార్!