నోటి నుంచి లేదా ముక్కు నుంచి గాలి ప్రవాహానికి ఆటంకం కలిగితే గురక వస్తుంది.

బరువు ఎక్కువగా ఉన్న 50 ఏళ్ల పైబడిన వారిలో గురక సమస్య సాధారణం.

స్త్రీల కంటే పురుషుల్లో గురక సమస్య చాలా ఎక్కువ.

కొంత మందిలో అలర్జీ లేదా సైనస్ వంటి సమస్యల వల్ల మాత్రమే గురక పెడతారు.

గొంతు, నాలుక కండరాలు టోన్డ్ గా లేనపుడు వాయు మార్గాలకు అడ్డు తగిలి గురక వస్తుంది.

నిద్ర పోయిన ప్రతిసారీ గురక చాలా పెద్దగా రావడం స్లీప్ ఆప్నియాకు సంకేతం.

స్లీప్ ఆప్నియా వల్ల నిద్రలేమి రావచ్చు.

స్లీప్ ఆప్నియా దీర్ఘకాలికంగా ఉన్న వారిలో అరిథ్మియాసిస్ అనే గుండె లయ సమస్య రావచ్చు.

ఇది క్రెంకినెస్, తీవ్రమైన డిప్రెషన్ వంటి సమస్యలకు కారణం కావచ్చు.

స్లీప్ ఆప్నియా కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్ మాదిరిగా హృదయ సంబంధ సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది.

అథెరో స్ల్కీరోసిస్ సమస్య లక్షణాల్లో గురక ఒకటట.
Representational Images : pexels