ధనియాల కషాయం అజీర్ణానికి మేలైన ఔషధంగా చెప్పుకోవచ్చు.

జీర్ణ క్రియకు అవసరమైయ్యే ఎంజైముల ఉత్పత్తి పెంచి అజీర్తి, కడుపుబ్బరం, అపాన వాయువు వంటి సమస్యలను నివారిస్తుంది.

కొన్ని అధ్యయనాలు ధనియాల కషాయం తాగడం వల్ల బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుందని చెబుతున్నాయి.

కనుక మధుమేహులు తరచుగా ధనియాల కషాయం తీసుకోవడం మంచిది.

ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది.

ధనియాల కషాయం తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారిస్తుంది.

ధనియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి.

క్రమం తప్పకుండా తీసుకున్నపుడు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉంటాయి. కార్డయో వాస్క్యూలార్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Representational image : pexels and pixabay