సముద్రపు చేపలు ఎందుకు తినాలి?

సముద్రపు చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిని ఎందుకో తినాలో ఓసారి తెలుసుకోండి.

వీటి ద్వారా అందే క్యాలరీలు తక్కువ. అధిక బరువు పెరగరు.

కంటికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

పిల్లలకు తినిపించడం వల్ల వారిలో మెదడు పనితీరు, ఎదుగుదల బావుంటుంది.

ఇది శక్తిని అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ స్థిరంగా ఉంచుతాయి.

చేపలు, పీతలు, రొయ్యల్లాంటి వాటిల్లో విటిమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది డిప్రెషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. సముద్రపు జీవుల్లో ఇవి పుష్కలంగా అందుతుంది.

కాకపోతే అతిగా తినకూడదు. ఏదైనా మితంగా తినాలి.