గసగసాలు తినకపోతే మనకే నష్టం



గసగసాలను ఒకప్పుడు విరివిగా వాడేవారు, కానీ ఇప్పుడు వాటి వాడకం చాలా తక్కువ.



చిన్న, గుండ్రంటి విత్తనాలు గసగసాలు. మసాలా కోవకే చెందుతాయివి.



ఇవి ఆహారానికి మంచి రుచిని అందించడమే కాదు, ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి.



గసగసాల్లో మాంగనీస్, కాపర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు ఉంటాయి.



గుండె జబ్బులు, గుండెపోటును నిరోధించే లక్షణాలు వీటిలో ఉన్నాయి.



వీటిలో ఉండే ఫైబర్ పొట్టలోని మంచి బ్యాక్టిరియాను పెంచుతుంది.



యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కణనష్టం జరగకుండా అడ్డుకుంటాయి.



కానీ గసగసాలు నీటిలో కడిగాక మాత్రమే వండాలి. వాటిపై ఉండే కలుషితాలు తినడం చాలా ప్రమాదకరం.