ఇన్‌స్టెంట్ చట్నీ పొడి రెసిపీ



వేరుశెనగ పలుకులు - ఒక కప్పు
పుట్నాల పప్పు - అర కప్పు
ఎండు కొబ్బరి - ఒక ముక్క
మినపగుళ్లు - ఒక టీస్పూను

ఎండు మిర్చి - పది
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
కరివేపాకులు - రెండు రెబ్బలు
ఉప్పు - రుచికి సరిపడా

కళాయిలో నూనె లేకుండా వేరుశెనగ పలుకును వేయించాలి.



తరువాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి.



అదే కళాయిలో మినప గుళ్లు, ఎండు మిర్చి, కరివేపాకులు, పుట్నాల పప్పు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.



ఇప్పుడు మిక్సీ జార్లో వేయించినవన్నీ వేయాలి. చివర్లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా వేసి కలపాలి.



వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి.



ఈ పొడిని ఒక సీసాలో వేసి గాలి చొరబడకుండా దాచుకోవాలి.