టేస్టీగా గుడ్డు కారం రెసిపీ

ఉడికించిన గుడ్లు - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను
గరం మసాలా - ఒక స్పూను
ఎండుకొబ్బరి పొడి - ఒక స్పూను

కారం - ఒక స్పూను
పసుపు - పావు టీస్పూను
కరివేపాకులు - ఒక రెమ్మ
తరిగిన కొత్తిమీర - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత

ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

కళాయిలో నూనె వేసి ఉడికించిన కోడిగుడ్లను వేయాలి. పసుపు, కారం, ఉప్పు వేసి వేయించాలి.

గుడ్డు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో రుబ్బుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేయాలి.

అల్లం వెల్లులి పేస్టు, గరం మసాలా, కొబ్బరి పొడి కూడా కలపాలి.

అన్నీ వేగాక గుడ్లు కూడా వేసి కలపాలి.

దించే ముందు కొత్తిమీర చల్లాలి. అంతే గుడ్డు కారం రెడీ.