జామకాయ ఎందుకు తినాలంటే..



జామకాయ పేదవాడి పండుగా గుర్తింపు పొందింది. దీన్ని తింటే ఎంతో ఆరోగ్యం.



డయాబెటిస్‌తో బాధపడేవారు కచ్చితంగా తినాల్సిన పండు జామ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.



ఈ పండు తినడం వల్ల సోడియం, పొటాషియం వంటివి శరీరానికి సమతులంగా అందుతాయి.



ఇది అధికరక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.



జామ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు విశ్రాంతి పొందుతాయి.



జామ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.



జామ కాయలు తినడం వల్ల చర్మానికి, జుట్టుకు మెరుపు వస్తుంది.



అధిక బరువు తగ్గాలనుకునేవారికి జామ మంచి ఎంపిక.