బెల్లం టీతో ఆరోగ్యం చలికాలంలో వేడివేడి టీ తాగితే చాలా సాంత్వనగా ఉంటుంది. కానీ ఆ టీ లో పంచదారకు బదులు బెల్లాన్ని వేసుకునేందుకు ప్రయత్నించండి. బెల్లంలో ఇనుము అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెల్లం టీ మంచి ఎంపిక. ఇది జీవక్రియలను వేగవంతం చేసి బరువు త్వరగా తగ్గేలా చేస్తుంది. మహిళలు ఖచ్చితంగా బెల్లం టీ ని తాగాలి. ఇలా తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే చాలా సమస్యలు తగ్గుతాయి. రోజూ బెల్లం టీ తాగితే పొట్ట, పేగులు, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఈ టీ తాగే వారిలో మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది జీవక్రియలను మెరుగుపరుస్తుంది. గర్భిణీలు బెల్లం టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం ఈ టీని తాగడం చాలా అవసరం.