చలి కాలంలో చలితో పోరాడేందుకు ఆహారంలో తప్పక కొన్ని మార్పులు చేసుకోవాలి. ఒంట్లో వేడి పెంచే పదార్థాలలో అల్లం కూడా ఒకటి . అల్లం అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. చలికాలంలో ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువ. అల్లం కషాయంగా, టీ గా తీసుకుంటే ఉపశమనం దొరుకుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. చాలా మంది చలికాలంలో ఆస్తమా, ఆయాసంతో బాధపడతారు. తేనెతో అల్లం రసం కలిపి తీసుకుంటే ఉపశమనం దొరుకుతుంది. అల్లం క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు నివారించవచ్చు. Representational Image : Pexels