విటమిన్ 12 ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండేందుకు అత్యవసరం. ఈ విటమిన్ తగ్గితే నాడీ వ్యవస్థ మీద ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. పాదాలు, చేతుల్లో మంటగా అనిపించడం, ముడతలు ఏర్పడడం, తిమ్మిరిగా అనిపించడం అటాక్సియా అంటే సమన్వయం కోల్పోవడం. బి12 తగ్గితే శరీరంలోని ఏ భాగంలోనైనా అటాక్సియా ప్రభావం పడవచ్చు. నడక, మాట, మింగడం, రాయడం, తినడం, దృష్టి ఇలా దేనిమీదైనా ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. వెన్నెముకలో కంప్రెషన్ వల్ల మైలోపతి సమస్య వస్తుంది. మెడ నొప్పి, కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, బలహీనతలు వస్తాయి. బి12 తగ్గినపుడు కాక్లియాలోని నాడుల్లో బలహీనత ఏర్పడి టిన్నిటస్ సమస్యలు రావచ్చు. బి12 లోపం శరీర భంగిమల్లో కూడా మార్పు తీసుకొస్తుంది. నడకలో సమతుల్యం కోల్పోవచ్చు. Representational Image : Pexels