బ్లాక్ రైస్ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి ఏజింగ్ ప్రభావాన్ని నిరోధిస్తుంది. బ్లాక్ రైస్ లో ఉండే ఆంథోసియనిన్ వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కనుక కార్డియోవాస్క్యూలార్ జబ్బులు అదుపులో ఉంటాయి. ఆంథోసియానిన్ మెదుడు పనితీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ లో ఫైబర్ చాలా ఎక్కువ. జీవక్రియలలో కొలెస్ట్రాల్ సంశ్లేషణ ను ప్రొత్సహిస్తుంది. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్లాక్ రైస్ లో బలమైన కెరొటినాయిడ్స్ ఉండడం వల్ల కంటి చూపుకు చాలా మేలు చేస్తుంది. వయసు ప్రభావంతో వచ్చే అంధత్వాన్ని నివారిస్తుంది. శరీరానికి ప్రతిరోజూ 7.4 గ్రాముల ఫైబర్ అవసరం. వంద గ్రాముల బ్లాక్ రైస్ తో 3.7 గ్రాముల ఫైబర్ అందుతుంది. వందగ్రాముల బ్లాక్ రైస్ నుంచి 9.9 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. Representational Image : Pexels and Pixabay