శీతాకాలంలో తప్పనిసరిగా నెయ్యి వాడాలి అంటుంటారు. ఎందుకో తెలుసుకుందాం.

చలికాలంలో చాలా త్వరగా దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

క్రమం తప్పకుండా తీసుకుంటే నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

నెయ్యిలో ఉండే బుటిరిక్ ఆసిడ్ వల్ల జీర్ణవ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. జీర్ణరసాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

చలికాలంలో రోజుకు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తింటే శరీరంలో వేడి పుడుతుంది.

జంక్, ఇతర సంతృప్త కొవ్వులు మానేసి కేవలం నెయ్యి మాత్రమే తీసుకుంటే ఆరోగ్యవంతమైన శరీర బరువు కలిగి ఉండవచ్చు.

మానసిక ఉల్లాసం కోసం, డిప్రెషన్ తగ్గించుకోవడం కోసం వెచ్చని పాలలో నెయ్యి కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఈ చిట్కా మంచి నిద్రకు కూడా ఉపకరిస్తుంది.
Representational Image : Pixabay