అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శ్వాస వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు, అలెర్జీలకు మంచి నివారణి

అల్లం శ్లేష్మాన్ని కరిగించి శరీరం నుంచి బయటకు పంపే ఎక్స్పెక్టరెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది.

పుదీనాను తాజా మూలికగా చెప్పుకోవచ్చు. ఇందులోని మెంథాల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది

ఉబ్బసం, బ్రాంకైటిస్, సైనసైటీస్ వంటి శ్వాస సమస్యలకు పుదీనా మంచి నివారణి.

పసుపులో ఉండే కర్కుమిన్ శ్వాస వ్యవస్థలో ఏర్పడే ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

శ్వాస వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలకు పసుపు మంచి నివారణోపాయం.

తులసి ప్రతి హిందూ ఇంట్లో ఉండే పవిత్రమైన మొక్క. తులసిలో విటమిన్ సి, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

తులసి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది.

Representational Image : Pexels and Pixabay