ముల్లంగిలో విటమిన్లు సి, కె ఉంటాయి. విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటి పెంచుతుంది. ముల్లంగిలో ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం నివారిస్తుంది. క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ కనుక ముల్లింగి తీసుకుంటే బరువు త్వరగా తగ్గవచ్చు. ఫ్రీరాడికల్ చర్యను అదుపు చేసే ఆంథోసియనిన్, ఫ్లవనాయిడ్స్ తో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్స్ ముల్లంగిలో పుష్కలం ముల్లంగిలో నీటి శాతం ఎక్కువ కనుక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కొన్ని అధ్యయనాలు ముల్లంగితో బీపీ అదుపులో ఉంటుందని ఫలితంగా రక్తనాళాలు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఫలితంగా వయసు ప్రభావం తగ్గుతుంది. Representational Image : Pexels and unsplash